నయన్ టాలీవుడ్ మెరుపులు

Friday,November 18,2016 - 05:40 by Z_CLU

మిగతా స్టార్ హీరోయిన్ లలా పెద్దగా హడావిడి లేకుండా ప్రైవేట్ గా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడే నయన్ ఈ రోజు తన 34 వ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటుంది. మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ… తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమా లక్ష్మి నుంచి నిన్నటి బాబు బంగారం  వరకు నయనతార టాలీవుడ్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్స్ చూద్దాం.

nayan-_-01

లక్ష్మి సినిమాలో వెంకటేష్ సరసన నటించిన నయన్.. తెలుగు ఆడియెన్స్ కి ఎప్పటినుంచో పరిచయం  ఉన్న తెలుగమ్మాయిలా ఆకర్షించడంలో సక్సెస్ అయింది. మొదటి సినిమానే సక్సెస్ అవ్వడంతో నయనతార, టాలీవుడ్ లో పర్మనెంట్ పొజిషన్ సెక్యూర్ చేసుకుంది.

nayan-_-02

ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘తులసి’.. నయన్ కరియర్ లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఈ సినిమా తరవాత నయనతార టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో బిజీ అయిపోయింది.

nayan-_-04

బాలయ్య సరసన సరికొత్త గెటప్ లో కనిపించిన నయన్, ‘సింహ’ సినిమాతో స్టార్  హీరోయిన్ రేస్ లో ఏకంగా ఫస్ట్ ప్లేస్ కి రీచ్ అయిపోయింది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా… నయనతార కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్.

nayan-_-05

అప్పటివరకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో బిజీగా ఉన్న నయనతార, జస్ట్ గ్లామరస్ హీరోయిన్ అనే ఇమేజ్ ని పూర్తిగా తారుమారు చేసిన సినిమా శ్రీరామ రాజ్యం. ఈ సినిమాలో తన అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ కి  నంది అవార్డును కూడా అందుకుంది.

nayan-_-06

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘కృష్ణం వందే జగద్గురుం’ నయనతార కరియర్ లోనే బెస్ట్ ఫిలిం. అప్పటి వరకు గ్లామరస్ పాత్రల్లో, హోమ్లీ పాత్రల్లో నటించిన నయనతార కరియర్లో, పర్ఫామెన్స్ కి స్కోప్ దొరికిన సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఈ సినిమా సక్సెస్ తో నయన్ కంప్లీట్ పర్ఫామెన్స్ ఓరియంటెడ్ హీరోయిన్ అనిపించుకుంది.