సీతమ్మ సందడి

Friday,November 18,2016 - 02:10 by Z_CLU

టాలీవుడ్ సీతమ్మ అంజలి ఈ మధ్య కాస్త స్పీడ్ తగ్గినట్టు అనిపించినా, ఒక్కసారిగా బ్యాక్ టు బ్యాక్  సినిమాలతో రెడీ అయింది. ఓ వైపు ‘అల్లుడు సింగం’ రిలీజ్ కి రెడీ అవుతుంటే, ఇంకో వైపు థ్రిల్లర్ కామెడీగా తెరకెక్కిన ‘చిత్రాంగద’ కూడా రైట్ టైం చూసి బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉంది.

img_0671

తెలుగు సినిమాకి కాస్త లేట్ గానే ఇంట్రడ్యూస్ అయినా, క్యారెక్టర్ ఇంప్రెసివ్ గా లేకపోతే అంత ఈజీగా సంతకం చేయని ఈ గడుసు పిల్ల.. 2011లో తమిళంలో రిలీజై సూపర్ హిట్టయిన ఇంకో సినిమాను కూడా తెలుగులో రిలీజ్ కి రెడీ చేస్తోంది. కాస్త వెనకబడినట్టు అనిపించే లోపే… ఏకంగా 3 సినిమాలతో సందడి మొదలుపెట్టేస్తుంది సీతమ్మ.