RangDe - బ్యూటిఫుల్ మెలొడీ

Thursday,November 12,2020 - 04:53 by Z_CLU

మ్యూజిక్ మెషీన్ దేవిశ్రీ ఓ రొమాంటిక్ ట్యూన్ కడితే ఎలా ఉంటుంది. అతడు కంపోజ్ చేసిన మెలొడీస్ అన్నీ సూపర్ హిట్స్. ఇప్పుడు DSP నుంచి మరో ప్రామిసింగ్ మెలొడీ వచ్చేసింది.

RangDe సినిమా నుంచి ‘ఏమిటో ఇది వివరించలేనిది’ అనే లిరిక్స్ తో సాగే కమ్మని మెలొడీని కొద్దిసేపటి కింద రిలీజ్ చేశారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ సాంగ్ కు దేవిశ్రీ తనదైన స్టయిల్ ఆఫ్ మెలొడీ టచ్ ఇచ్చాడు

హరిప్రియ-కపిల్ ఈ సూతింగ్ మెలొడీని ఆలపించారు. ఒక్కసారి వింటే చాలు హమ్మింగ్ చేసుకునేలా బ్యూటిఫుల్ గా కంపోజ్ అయింది ఈ సాంగ్. రంగ్ దే సినిమా నుంచి వచ్చిన మొట్టమొదటి సాంగ్ ఇదే.

ఈ మధురమైన మెలొడీని పీసీ శ్రీరామ్ విజువల్స్ యాడ్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సిల్వర్ స్క్రీన్ పై చూసి తీరాల్సిందే.

Also Check – రంగ్ దే స్టిల్స్

ఇక RangDe Shooting అప్ డేట్స్ విషయానికొస్తే.. ఈ నెల చివరి వారం నుంచి కొన్ని కీలక సన్నివేశాలు తీస్తారు. ఆ తర్వాత దుబాయ్ లో సాంగ్స్ షూటింగ్ తో టోటల్ మూవీ కంప్లీట్ అవుతోంది. 2021 సంక్రాంతి కానుకగా రాబోతోంది రంగ్ దే.