దేవిశ్రీ ప్రసాద్

Friday,October 30,2020 - 12:02 by Z_CLU

దేవిశ్రీ ప్రసాద్ ప్రముఖ సంగీత దర్శకుడు, నేపధ్య గాయకుడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల సినిమాలకు సంగీతం అందించారు. ఆగస్టు 2 ,1979 లో జన్మించారు. శాస్త్రీయ సంగీత నేపధ్యం ఉన్న కుటుంబం కావడం తో చిన్న తనం నుండే సంగీతం పై ఆసక్తి పెంచుకున్నారు దేవి.

మొదట మాండొలిన్ శ్రీనివాస్ గారి దగ్గర మాండొలిన్ నేర్చుకున్నారు. ‘దేవి’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమకు సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్న దేవి ఆ తరువాత ‘నీ కోసం’, ‘నవ్వుతూ బతకలిరా’ సినిమాలకు సంగీతం అందించారు.

ఆ తరువాత ‘ఆనందం’, ‘వర్షం’, ‘సొంతం’, ‘కలుసుకోవాలని’, ‘ఖడ్గం’, ‘మన్మధుడు’ , ‘వెంకీ’, ‘ఆర్య’,’ శంకర్దాదా ఎం.బి.బి.ఎస్’,’మాస్’,’ నువ్వొస్తానంటేనేనొద్దంటానా’,’బన్నీ’,’భద్ర’,’అందరివాడు’,’ఆరు’,’పౌర్ణమి’, ‘బొమ్మరిల్లు’, ‘రాఖీ’,’జగడం’, ‘ఆట’,’శంకర్ దాదా జిందా బాద్’,’జల్సా’,’రెడీ’,’కింగ్’,’కరెంట్’,’ఆర్య2′,’అదుర్స్’,’100%లవ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్ ‘, ‘ఊసరవెళ్లి’,’గబ్బర్ సింగ్’, ‘జులాయ్’, ‘డమరుకం’, ‘సారొచ్చారు’,’మిర్చి’,’ఇద్దరమ్మాయిలతో’,’సింగం’,’ఎవడు’, ‘అత్తారింటికి దారేది’,’1నేనొక్కడినే’,’లెజెండ్’,’అల్లుడుశీను’, ‘సన్అఫ్సత్యమూర్తి’, ‘శ్రీమంతుడు’,’శివమ్’,’కుమారి’, ‘నాన్నకు  ప్రేమతో’,’నేను శైలజ’,’సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి సినిమాలతో పాటు తమిళ్, హిందీ భషాల్లో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించి సంగీత దర్శకుడు, గాయకుడిగా వరుసగా ఘన విజయాలు అందుకొని టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు.

Born : 2 August 1979

సంబంధిత వార్తలు