Pushpa - బన్నీ ఫస్ట్ స్టిల్ ఇదే

Thursday,November 12,2020 - 04:19 by Z_CLU

పుష్ప సినిమా నుంచి ఫస్ట్ లుక్ ఆల్రెడీ వచ్చింది. కానీ లొకేషన్ నుంచి మొట్టమొదటి స్టిల్ ఈరోజే రిలీజైంది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీప్రాంతంలో జరుగుతున్న షెడ్యూల్ లో తొలిసారి జాయిన్ అయ్యాడు బన్నీ. ఆ లొకేషన్ నుంచి Allu Arjun స్టిల్ ను రిలీజ్ చేశారు.

సాదాసీదా చొక్కా వేసుకొని నడుచుకుంటూ బన్నీ వెళ్తుంటే వెనక నుంచి తీసిన స్టిల్ ను రిలీజ్ చేశారు. ఓ సాధారణ కూలీ, ఎర్రచందనం స్మగ్లర్ గా ఎలా మారాడనే స్టోరీతో Pushpa మూవీ వస్తుందని టాక్.

Allu Arjun 1st still from PUSHPA

మరోవైపు హీరోయిన్ రష్మిక కూడా ఆల్రెడీ సెట్స్ లో జాయిన్ అయింది. నెల రోజుల పాటు జరగనున్న ఈ షూటింగ్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు కొంత టాకీని పూర్తిచేయబోతున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు సుకుమార్ డైరక్టర్. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read – బన్నీ సినిమాలో తమిళ హీరో?