రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన బాలయ్య

Saturday,October 28,2017 - 01:08 by Z_CLU

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న కొత్త సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. రిలీజ్ డేట్ మేటర్ తో పాటు ఈ రోజు ఈ సినిమాకు సంబంధించి ఏకంగా 3 విషయాలు కన్ ఫర్మ్ చేశారు. అందులో మొదటిది ఎన్నాళ్లనుంచో నలుగుతున్న జై సింహా అనే పేరును అఫీషియల్ గా ప్రకటించారు. ఇక రెండోది ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నవంబర్ 1న విడుదల చేయబోతున్నారు. మూడోది సినిమాను సంక్రాంతి బరిలో నిలిపారు. జనవరి 12న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖలో జరుగుతోంది. బాలయ్యపై ఓ ఫైట్ ఎపిసోడ్ తీస్తున్నారు. 20 రోజుల ఈ షెడ్యూల్ లో బాలయ్యపై సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ కూడా తీయబోతున్నారు. చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సెకెండ్ హీరోయిన్ గా నటాషా దోషి, మూడో హీరోయిన్ గా హరిప్రియ కనిపించనున్నారు.