40 ఏళ్ల నటజీవితం 4-5 ఏళ్లుగా అనిపిస్తోంది

Saturday,October 28,2017 - 01:18 by Z_CLU

దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పార్క్ లో కనీవినీ ఎరుగని రీతిలో గ్రాండ్ గా జరిగిన 2.0 ఆడియో లాంచ్ లో రజనీకాంత్ స్పీచ్ అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఇప్పటితరం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్న సూపర్ స్టార్.. ఈ 40 ఏళ్ల నటజీవితం నాలుగైదేళ్లుగా అనిపిస్తోందన్నారు. ఇప్పటితరం, నేటి హైటెక్ టెక్నాలజీలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉన్న రజనీకాంత్.. దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంలో నటించిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనన్నారు.

ఇదే వేదికపై దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. 2.0 చిత్రం త‌మిళ సినిమా మాత్రమే కాదు  ఇదొక ఇండియ‌న్ సినిమా. నాకు భాషా బేదాలు లేవు. చికుబుకు రైలే పాట‌తో రెహ‌మాన్‌తో నా ప్ర‌యాణం ప్రారంభ‌మైంది. మా జ‌ర్నీ 23 ఏళ్లుగా కొన‌సాగుతుంది. రోబోలో  ఇనుములో హృద‌యం మొలిచెనె పాట‌కు రెహ‌మాన్ చాలా క‌ష్ట‌ప‌డి ట్యూన్ అందించారు. 2.0లో కూడా రెండు మిష‌న్ల‌కు మ‌ధ్య ల‌వ్‌సాంగ్‌కు ఇంకా క‌ష్ట‌ప‌డి ట్యూన్ ఇచ్చారు. అని అన్నారు.

శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ హీరోగా న‌టిస్తున్న సైంటిఫిక్ విజువ‌ల్ వండ‌ర్ `2.0`. ఈ చిత్రం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో జ‌న‌వ‌రి 25న విడుద‌ల‌వుతుంది. అక్టోబ‌ర్ 27న అంటే..నిన్న దుబాయ్ బూర్జ్ ఖ‌లీఫాలో ఆడియో ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది.  2.0 భార‌తీయులు గ‌ర్వించ‌ద‌గ్గ సినిమా అని రెహ‌మాన్ తెలిపారు.  ఈవేడుక‌కు ర‌జ‌నీకాంత్ కుటుంబ స‌భ్యులు, సూర్య‌, జ్యోతిక త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.