గ్రాండ్ గా 2.0 ఆడియో రిలీజ్

Saturday,October 28,2017 - 01:00 by Z_CLU

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 2.0 సినిమా ఆడియో రిలీజ్ దుబాయ్ లో గ్రాండ్ గా జరిగింది. కళ్లుచెదిరే రేంజ్ లో జరిగిన ఈ ఆడియో ఫంక్షన్ లో సూపర్ స్టార్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అదిరిపోయే స్పీచ్ తో అందర్నీ ఆకట్టుకున్నారు.

ఆడియో రిలీజ్ లో భాగంగా 2 సాంగ్స్ విడుదలచేశారు. మిగిలిన ఒక పాటను ప్రమోషన్ లో భాగంగా త్వరలోనే విడుదల చేయబోతున్నారు. సినిమాలో ఉన్నవి ఈ 3 పాటలే.

125 మంది సంఫనీ కళాకారులతో రెహ్మాన్ ఇచ్చిన లైఫ్ షో అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఈ షో తర్వాత హీరోయిన్ అమీ జాక్సన్ డాన్స్ షో, అక్షయ్ కుమార్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఎంటర్ టైన్ చేశాయి. రానా, కరణ్ జోహార్ యాంకరింగ్ తో పాటు సూర్య, ధనుష్, జ్యోతిక, కార్తి ఎప్పీయరెన్స్ షోకు మరింత లుక్ తీసుకొచ్చింది

ఈ ఒక్క ఈవెంట్ కోసం దాదాపు 12 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు నిర్మాతలు. షో సూపర్ హిట్ అవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న 2.0 సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా బడ్జెట్ 450 కోట్ల రూపాయలు.