'RRR' లో మరో హీరోయిన్ కూడా ఫిక్స్ ?

Sunday,January 27,2019 - 01:02 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ ఎవైటింగ్ మల్టీ స్టారర్ ‘RRR’ ప్రెజెంట్ సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. షూటింగ్ మొదలై చాలా రోజులైనా ఇంత వరకూ సినిమాలో హీరోయిన్స్ ని అనౌన్స్ చేయలేదు మేకర్స్. దీంతో రోజుకో హీరోయిన్ పేరు తెరపైకొస్తుంది. నిన్నటి వరకూ కీర్తి సురేష్ ని ఒక హీరోయిన్ గా ఫైనల్ చేసారనే వార్త చక్కర్లు కొట్టగా ఇప్పుడు మరో హీరోయిన్ గా పరిణితి చోప్రా ఫిక్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది.

ఎప్పటి నుండో ఓ బిగ్ ప్రాజెక్ట్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న పరిణితి  ఈ మల్టీ స్టారర్ తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం కానుందని తెలుస్తోంది. ఈ వార్తపై ఇంకా యూనిట్ నుండి ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు . మరి త్వరలోనే హీరోయిన్స్ గా కీర్తి , పరిణితి పేర్లు ప్రకటిస్తారేమో చూడాలి.