బాలయ్య హీరోయిన్ కోసం పూరి

Thursday,March 09,2017 - 05:04 by Z_CLU

బాలయ్య 101 సినిమా లాంచ్ అయింది. అల్టిమేట్ డైలాగ్స్ కి కేరాఫ్ అడ్రస్ బాలయ్య. అలాంటిది ఆయన గత సినిమాలకు ధీటుగా ఈ సినిమాలో కూడా డైలాగ్స్ ఆ రేంజ్ లో ఉంటాయని ప్రామిస్ చేసిన పూరి జగన్నాథ్ ‘ఈ సినిమా రిలీజ్ తరవాత, జస్ట్ పంచ్ డైలాగ్స్ కే ఒక్క DVD సరిపోతుంది. అన్ని డైలాగ్స్ ఉంటా’యని సినిమా లాంచ్ టైం లోనే, సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో కళ్ళకు కట్టేశాడు. మరి హీరోయిన్స్ సంగతేంటి…?

పూరి కరియర్ గ్రాఫ్ లో ‘లోఫర్’ నుండి మొదలు ‘రోగ్’ వరకు ఒక్కో సినిమాకి ఒక్కో హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేసే ఆచారాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాడు. ‘లోఫర్’ తో దిశా పటానిని ఇంట్రడ్యూస్ చేస్తే, కళ్యాణ్ రామ్ ‘ఇజం’ తో ఆదితి ఆర్య ని ఇంట్రడ్యూస్ చేశాడు. అలాగే రోగ్ లోను హీరో ఇషాన్ తో పాటు, హీరోయిన్ ఏంజిలా ను ఇంట్రడ్యూస్ చేశాడు. మరి ఇదే ఆచారాన్ని బాలయ్య సినిమాకు కూడా ఫాలో అయిపోతాడా..?

 

ఈ సారి బాలయ్య సరసన స్పేస్ ని అక్యుపై చేసే లక్కీ హీరోయిన్ ఎవరు.? సినిమా ఇలా లాంచ్ అయిందో లేదో, అప్పుడే సినీటౌన్ లో ఈ క్వశ్చన్ రేజ్ అయిపోయింది. మరి పూరి మైండ్ లో ఏం నడుస్తుందో ఓసారి డీటేల్స్ అనౌన్స్ చేస్తే కానీ తేలదు. మార్చి 16 న సెట్స్ పైకి రానున్న ఈ సినిమా సెప్టెంబర్ 29 కి రిలీజ్ అని అప్పుడే కన్ఫం చేసేసింది సినిమా యూనిట్.