రీమేక్ తో రెడీ అవుతున్నాడు...

Thursday,March 09,2017 - 06:02 by Z_CLU

లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ సినిమాతో థియేటర్లోకొచ్చిన అల్లరి నరేష్ ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని మరో రీమేక్ సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు… మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ఓరు వడక్కన్‌ సెల్ఫీ’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు నరేష్…..

  జాహ్నవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీమతి నీలిమ సమర్పణలో చంద్రశేఖర్‌ బొప్పన నిర్మించబోతున్న ఈ సినిమాకు మలయాళ మాతృక దర్శకుడైన జి. ప్రజీత్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ నెల (మార్చి) 16 నుండి ఏప్రిల్‌ 5 వరకు పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుపుకొని .. ఏప్రిల్‌ 16 నుండి తదుపరి షూటింగ్‌ మొత్తం హైద్రాబాద్‌లో జరుపుకోనుంది. నిఖిల విమల్‌ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌ కీలకపాత్రలో నటించనున్నారు. మరి ఈ రీమేక్ సినిమాతో అల్లరోడు ఎలా ఎంటర్టైన్ చేస్తాడో..చూడాలి..