బాలయ్య రేంజ్ విలన్

Wednesday,March 22,2017 - 03:21 by Z_CLU

బాలకృష్ణ పూరి జగన్నాథ్ సినిమా ఆల్ రెడీ సెట్స్ పై ఉంది. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ మరో వైపు తక్కిన కాస్టింగ్ ని ఫైనలైజ్ చేసుకునే పనులను కూడా చూసుకుంటున్నాడు. సినిమా బిగినింగ్ లోనే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ కి యాక్షన్ చెప్పిన పూరి, ఇంతకీ బాలయ్యకి విలన్ గా ఎవరిని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు..? ఇదే నందమూరి ఫ్యాన్స్ లో రేజ్ అవుతున్న మిలియన్ డాలర్ క్వశ్చన్.

మామూలుగానే పూరి విలన్స్ అంటే సూపర్ స్టైలిష్ గా ఉంటారు. అందునా బాలయ్య కాంబినేషన్ లో అంటే రెగ్యులర్ సినిమా కన్నా కంపల్సరీగా నెక్స్ట్ లెవెల్ లో ఆలోచించాలి. అందుకే ఫ్యాన్స్ లో ఈ సినిమా విలన్ స్పెషల్ ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ లా మారిపోయాడు.

ఆల్ రెడీ సెట్స్ పైకి వచ్చేసిన ఈ సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందో తెలీదు కానీ, పూరి మాత్రం బాలయ్యని సరికొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడని టాక్. ఈ రోజుతో ఫస్ట్ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పనున్న సినిమా యూనిట్, విలన్ విషయంలో ఓ డెసిషన్ కి వచ్చి, రేపో మాపో ఈ సస్పెన్స్ ని కూడా రివీల్ చేస్తారని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.