నాగచైతన్య సినిమా ఫస్ట్ లుక్

Wednesday,March 22,2017 - 05:37 by Z_CLU

అల్టిమేట్ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతున్న నాగచైతన్య సినిమా ఫస్ట్ లుక్ రెడీ ఫర్ రిలీజ్  మోడ్ లో ఉంది. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా, సెట్స్ పై ఉండగానే పాజిటివ్ బజ్ ని బ్యాగ్ లో వేసుకుంటుంది. దానికి తోడు డిఫరెంట్ గా ఉన్న ఈ సినిమా టైటిల్ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేస్తుంది.

మార్చ్ 29 న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలనుకుంటున్న సినిమా యూనిట్, ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. జగపతి బాబు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.