బాలకృష్ణ కొత్త సినిమా హీరోయిన్ ఫిక్స్

Monday,March 27,2017 - 07:10 by Z_CLU

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ సినిమాకు ఇంకా పేరు ఫిక్స్ చేయలేదు. ఫస్ట్ షెడ్యూల్ మాత్రం కంప్లీట్ అయింది. వచ్చే వారం నుంచి సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్ లో ఓ హీరోయిన్ ను ఫిక్స్ చేశాడు దర్శకుడు పూరి జగన్నాధ్. బాలయ్య సరసన ముష్కాన్ అనే కొత్తమ్మాయిని ఇంట్రడ్యూస్ చేేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ విషయాన్ని త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు.

వాస్తవానికి బాలయ్య కొత్త సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ముగ్గుర్లో ఒకర్ని స్టార్ హీరోయిన్ ను తీసుకొని, మిగతా ఇద్దరు హీరోయిన్ల స్థానంలో కొత్తమ్మాయిల్ని పరిచయం చేయాలనేది ప్లాన్. ఇందులో భాగంగానే ముస్కాన్ సెలక్ట్ చేసినట్టు తెలుస్తోంది. రోగ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ విషయాల్ని వెల్లడించాడు దర్శకుడు పూరి జగన్నాథ్.

హీరోయిన్ మేటర్ తో పాటు.. బాలయ్య 101వ సినిమా స్టోరీలైన్ ను కూడా వివరించాడు. గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలిపిన పూరి… బాలయ్య ఇందులో కంప్లీట్ ఎగ్రెసివ్ లుక్ తో, మోస్ట్ డైనమిక్ గా కనిపిస్తారని క్లారిటీ ఇచ్చాడు. బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అంతా కొత్తగా ఫీల్ అయ్యేలా సినిమా ఉంటుందని అంటున్నారు పూరి జగన్నాథ్.