పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి...

Monday,March 27,2017 - 06:03 by Z_CLU

పవర్ స్టార్ కాటమరాయుడు రిలీజయింది. ఓ వైపు ఈ సినిమా రిలీజయిన ప్రతి సెంటర్ లోను రికార్డులు బ్రేక్ చేసే పనిలో ఉంది. మరోవైపు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చే ఫార్మాలిటీస్ అప్పుడే బిగిన్ అయిపోయాయి.

ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ ఈ సినిమాని ఏప్రియల్ 6 నుండి సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ కి ఆల్ రెడీ ప్యాకప్ చెప్పేసిన త్రివిక్రమ్ ఈ సినిమాని పవర్ స్టార్ స్టైల్ లో ఫాస్ట్ పేజ్ లో కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్స్ గా నటించనున్న ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడని టాలీవుడ్ లో చిన్న టాక్.