జీ సినిమాలు (మార్చి 28th)

Monday,March 27,2017 - 10:05 by Z_CLU

నటీనటులు  – శోభన్ బాబు, రోజా

ఇతర నటీనటులు – వాణివిశ్వనాథ్, రేఖ, నగేష్, నూతనప్రసాద్, బ్రహ్మానందం, సాయికుమార్

మ్యూజిక్ డైరెక్టర్  – విద్యాసాగర్

ప్రొడ్యూసర్  – డా. డి.రామానాయుడు

డైరెక్టర్  – పరుచూరి బ్రదర్స్

రిలీజ్ డేట్  – 1991

తెలుగు సినిమాలో మాటల ప్రవాహానికి గేట్లు తెరిచిన రచయితల  ద్వయంగా అప్పటికే పరుచూరి బ్రదర్స్ కు ఓ పేరు వచ్చేసింది. అప్పటివరకు ఓ రకమైన పడికట్టు పదాలతో సాగిన తెలుగు సినిమా డైలాగుల్ని సమూలంగా మార్చేశారు ఈ స్టార్ బ్రదర్స్. అలా మాటలతో పాపులరైన ఈ బ్రదర్స్ ను దర్శక ద్వయంగా చూపించారు నిర్మాత రామానాయుడు. పరుచూరి బ్రదర్స్ దర్శకులుగా మారి తెరకెక్కించిన సినిమా సర్పయాగం. ఫ్యామిలీ హీరో శోభన్ బాబును మోస్ట్ ఎమోషనల్ యాంగ్రీ యంగ్ మేన్ గా చూపించిన సినిమా ఇది.

==========================================================================

నటీనటులు  – ఏఎన్నార్, సావిత్రి

ఇతర నటీనటులు – కృష్ణకుమారి, రేలంగి, గుమ్మడి, పద్మనాభం

మ్యూజిక్ డైరెక్టర్  – సాలూరి రాజేశ్వరరావు

ప్రొడ్యూసర్  –  దుక్కిపాటి మధుసూధనరావు

డైరెక్టర్  – ఆదుర్తి సుబ్బారావు

రిలీజ్ డేట్  – 1963

అప్పటికే ప్రయోగాలకు పెట్టిందిపేరుగా ఆదుర్తి పేరు సంపాదించుకున్నారు. కథలు ఇలాగే ఎందుకుండాలి… సన్నివేశాలు ఇలానే ఎందుకు తీయాలి… భావోద్యేగాలు రొటీన్ గానే కనిపించాలా… అంటూ ప్రశ్నించిన మొదటితరం టెక్నీషియన్లలలో ఆదుర్తి ముందుంటారు. తన కెరీర్ ను కూడా అంతే కొత్తగా కొనసాగించిన ఆదుర్తి… చదువుకున్న అమ్మాయిలు సినిమాతో కూడా ప్రయోగమే చేశారని చెప్పాలి. కాలాతీత వ్యక్తులు అనే నవలను సినిమాగా తీయాలనే ఆలోచన కూడా రాని రోజుల్లో… ఆ నవలతో సినిమా చేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆదుర్తి మీద నమ్మకంతో అక్కినేని కాల్షీట్లు ఇచ్చారు. అక్కినేని చేరారు కాబట్టి సావిత్రి కూడా ఒప్పుకున్నారు. అక్కినేని-సావిత్రి నటిస్తున్నారు కాబట్టి మిగతా నటీనటులు, టెక్నీషియన్లలు కూడా కుదిరిపోయారు. అలా అతితక్కువ కాలంలోనే  చదువుకున్న అమ్మాయిలు సినిమాగా రూపుదిద్దుకుంది కాలాతీత వ్యక్తులు సినిమా. సాలూరి రాజేశ్వరరావు సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్. వినిపించని రాగాలే, కిలకిల  నవ్వులు లాంటి పాటలు వింటే మనసు మేఘాల్లో తేలిపోతుంది.

============================================================================

నటీనటులు – వినోద్ కుమార్, రంజిత

ఇతర నటీనటులు – కృష్ణంరాజు, సంఘవి, శారద, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, బ్రహ్మానందం

మ్యూజిక్ డైరెక్టర్  –  మాధవపెద్ది సురేష్

డైరెక్టర్  – ఎస్.సదాశివరావు

రిలీజ్ డేట్  – 1996

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన మరో సూపర్ హిట్ మూవీ తాత-మనవడు. అప్పటికే యాక్షన్ సినిమాల నుంచి కుటుంబకథాచిత్రాల వైపు మళ్లారు హీరో వినోద్ కుమార్. పర్ ఫెక్ట్ ఫ్యామిలీ  హీరోగా కొన్ని హిట్స్ కూడా అందుకున్నారు. అందుకే తాత-మనవడు కథకు హీరో కోసం  పెద్దగా అన్వేషణలు ఏమీ పెట్టుకోలేదు నిర్మాత రామానాయుడు. అయితే తాత పాత్ర వద్దకు  వచ్చేసరికి మాత్రం చాలా డిస్కషన్ జరిగింది. ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు  పరిశీలించిన తర్వాత ఫైనల్ గా కృష్ణంరాజును అనుకున్నారు. అలా  మనవడిగా వినోద్ కుమార్, తాతగా కృష్ణంరాజు సెట్ అయిపోయారు. సదాశివరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ  సినిమాకు సంగీతం పెద్ద హైలెట్.

============================================================================

నటీ నటులు : నారా రోహిత్ , శుబ్ర అయ్యప్ప

ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, విష్ణు, జయ ప్రకాష్ రెడ్డి, గిరిబాబు, రంగనాథ్, రవి ప్రకాష్.

మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్

డైరెక్టర్ : ప్రశాంత్ మండవ

ప్రొడ్యూసర్ : సాంబశివ రావు

రిలీజ్ డేట్ : 25 April 2004

అతి తక్కువ కాలంలోనే విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న నారా రోహిత్ కరియర్ లో స్పెషల్ సినిమా ప్రతినిధి. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని తరవాత తమిళంలో KO2 గా రీమేక్ కూడా చేశారు. నారా రోహిత్ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ సినిమాకి హైలెట్.

=============================================================================

నటీనటులు  – సిద్దార్థ్, శృతిహాసన్

ఇతర నటీనటులు – నవదీప్, హన్సిక,

మ్యూజిక్ డైరెక్టర్  – రాహుల్ రాజ్

నిర్మాత – దిల్ రాజు

దర్శకత్వం – వేణుశ్రీరాం

విడుదల – 2011, నవంబర్ 11

స్నేహానికి  సరికొత్త అర్థాన్నిస్తూ తెరకెక్కిన ఓ మై ఫ్రెండ్ సినిమాకు చాలా విశేషాలున్నాయి. తెలుగులో  శృతిహాసన్ కు ఇది రెండో సినిమా. అయితే శృతిహాసన్ కంటే ముందే  ఆ క్యారెక్టర్ కోసం సమంతను అనుకున్నారు. అప్పటికే ఏమాయచేశావెతో సక్సెస్ అందుకున్న సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని దిల్ రాజు కూడా అనుకున్నాడు. ఆ తర్వాత అమలాపాల్, నిత్యామీనన్ లాంటి హీరోయిన్లపై కూడా ఫొటోషూట్ చేశారు. ఫైనల్ గా హీరో సిద్ధార్థ్ పట్టుబట్టి మరీ శృతిహాసన్ ను తీసుకున్నాడు. ఈ సినిమాతోనే వేణుశ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కాగా.. ఇదే మూవీతో మలయాళం ఇండస్ట్రీకి చెందిన రాహుల్ రాజ్ సంగీత దర్శకుడిగా కూడా పరిచయం అయ్యాడు. ఆన్ లైన్ లో పైరసీ జరగకుండా నిరోధించే అత్యాధునిక టెక్నాలజీ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమైంది.

==============================================================================

నటీనటులు : సూర్య, సమంతా రుత్ ప్రభు

ఇతర నటీనటులు : విద్యుత్ జమ్వాల్, సూరి, బ్రహ్మానందం, మనోజ్ బాజ్ పాయ్, దళిప్ తాహిల్, మురళి శర్మ, ఆసిఫ్ బస్రా మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : N. లింగుస్వామి

ప్రొడ్యూసర్ : సిద్ధార్థ్ రాయ్ కపూర్, N. సుభాష్ చంద్రబోస్

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2014

సూర్య హీరోగా నటించిన సికందర్ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్. డ్యూయల్ రోల్ లో నటించిన సూర్య నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. చిన్నప్పుడే తప్పిపోయిన తన అన్నను వెదుక్కుంటూ వచ్చిన తమ్ముడు అప్పటికే తన అన్న సిటీలో పెద్ద డాన్ అని తెలుసుకుని షాక్ కి గురి అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రధాన కథాంశం. ఈ సినిమాలో సూర్య సరసన సమంతా హీరోయిన్ గా నటించింది.

===========================================================================

నటీనటులు : మమ్ముట్టి, సునీత, మధుబాల

ఇతర నటీనటులు : M.G. సోమన్, శ్రీ విద్య, సంగీత, రఘు, రాజా, అంజు, షానవాజ్, ఆగస్తైన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మరగతమణి

డైరెక్టర్ : I.V. శశి

ప్రొడ్యూసర్ : K.R.G.

రిలీజ్ డేట్ : 30 నవంబర్ 1991

మమ్ముట్టి, మధుబాల హీరోయిన్ లు గాతేరకేక్కిన్ బాల్క్ బస్టర్ అయిన నీలగిరి సినిమాకి డబ్బింగ్ వర్షనే రౌడీ రాజ్యం. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మరగతమణి అందించిన సంగీతం హైలెట్ గా నిలుస్తుంది.