డిసెంబర్ 16న గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో

Monday,November 28,2016 - 06:18 by Z_CLU

బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా నందమూరి అభిమానుల్లో పెద్ద పండగే పట్టుకొచ్చింది. తెలుగు ప్రజల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

gps-2

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న GPS 79 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా అంచనాలకు మించి సూపర్ హిట్ కావాలని నందమూరి అభిమానులు ఏకంగా 1116 దేవాలయాల్లో మహారుద్రాభిషేకాలు కూడా జరిపిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ని డిసెంబర్ 16 న గ్రాండ్ గా ప్లాన్ చేశారు.