జీ సినిమాలు (నవంబర్ 29th)

Monday,November 28,2016 - 08:00 by Z_CLU

prema-nd-co

హీరోహీరోయిన్లు – నరేష్, వాణీ విశ్వనాథ్
నటీనటులు – రావుగోపాల్రావు, గిరిబాబు, మల్లికార్జునరావు, శివాజీరాజా, బ్రహ్మానందం
సంగీతం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – వంశీ
విడుదల తేదీ – 1994

లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల, చెట్టుకింద ప్లీడర్.. ఇలా వరుస విజయాలతో వంశీ ఊపుమీదున్న రోజులవి. అయితే సినిమాలు మాత్రం సెలక్టివ్ గానే చేసేవారు వంశీ. కథ, కథనం, సంగీతం అన్నీ సెట్ అయిన తర్వాత మాత్రమే సెట్స్ పైకి వెళ్లేవారు. జోకర్ సినిమా వచ్చిన తర్వాత దాదాపు 7నెలలు గ్యాప్ తీసుకొని వంశీ చేసిన సినిమా ప్రేమ అండ్ కో. నరేష్ వాణీవిశ్వనాద్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తుంది. భానుప్రియ, సుహాసిని తర్వాత వంశీ దర్శకత్వంలో ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో నటించిన మూడో హీరోయిన్ గా వాణివిశ్వనాథ్ గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. తన మూవీస్ కు రెగ్యులర్ గా సంగీతం అందించే ఇళయరాజా బిజీగా ఉండడంతో… ప్రేమ అండ్ కో మూవీకి వంశీనే సంగీతం కూడా అందించారు.

——————————————————————

prema-kanuka

నటీ నటులు : అక్కినేని నాగేశ్వరావు , శ్రీ దేవి
ఇతర నటీనటులు : మోహన్ బాబు, రావు గోపాల్ రావు, సత్య నారాయణ, అల్లు రామ లింగయ్య, ప్రభాకర్ రెడ్డి, చక్రవర్తి, చలపతి రావు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి
డైరెక్టర్ : కె.రాఘవేంద్ర రావు
ప్రొడ్యూసర్ : వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 27 జూన్ 1981

అక్కినేని నాగేశ్వరావు -శ్రీదేవి జంటగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం ‘ప్రేమ కానుక’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా అలరించి మంచి విజయం సాధించింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు-ఎ.ఎన్.ఆర్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం లో ఎ.ఎన్.ఆర్ శ్రీదేవి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు కామెడీ ఒకెత్తయితే , చక్రవర్తి అందించిన సంగీతం మరో ఎత్తు. ముఖ్యంగా సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ దర్శకేంద్రుడి స్క్రీన్ ప్లే ఆకట్టుకొనే సన్నివేశాలతో ఈ చిత్రం అలరిస్తుంది.

——————————————————————

todi-kodallu-1

హీరోహీరోయిన్లు – సురేష్, మాలాశ్రీ
నటీనటులు – సుధాకర్, నర్రా, బ్రహ్మానందం, మురళీమోహన్, చంద్రమోహన్, జయసుధ
సంగీత దర్శకుడు – రాజ్ కోటి
నిర్మాత – డాక్టర్ డి.రామానాయుడు
దర్శకుడు – బోయిన సుబ్బారావు
విడుదల తేదీ – 1994

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన మరో కుటుంబకథాచిత్రం తోడికోడళ్లు. సురేష్, మాలాశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కీలకపాత్రల్లో జయసుధ, మురళీమోహన్, చంద్రమోహన్ నటించారు. రాజ్ కోటి ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. గోదావరి అందాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

——————————————————————

kasko-telugu-movie
నటీ నటులు : వైభవ్, శ్వేతా బసు ప్రసాద్
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, గౌరి పండిత్, జయ ప్రకాష్ రెడ్డి, చలపతి రావు, ఎం.ఎస్.నారాయణ, రఘు బాబు, ప్రదీప్ రావత్, రాజేష్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ప్రేమ్ జి
డైరెక్టర్ : జి.నాగేశ్వర రెడ్డి
సమర్పణ :ఎ. కోదండ రామిరెడ్డి
ప్రొడ్యూసర్ : ఎ. భారతి
రిలీజ్ డేట్ : 25 జనవరి 2009

ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి తనయుడు వైభవ్- శ్వేతా బసు ప్రసాద్ జంటగా తెరకెక్కిన ఎంటర్టైనర్ చిత్రం ‘కాస్కో’. కోదండ రామి రెడ్డి నిర్మాణం లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు జి.నాగేశ్వరెడ్డి తన దైన స్టైల్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించారు. ఈ సినిమాకు ప్రేమ్ జి మ్యూజిక్ హైలైట్ కాగా వైభవ్-శ్వేతా బసు ప్రసాద్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు, గౌరి పండిత్ గ్లామర్, మహేష్ బాబు పేరుతో బ్రహ్మానందం కామెడీ బాగా అలరిస్తాయి.

——————————————————————

bhai-telugu-movie
నటీ నటులు : నాగార్జున, రీచా గంగోపాధ్యాయ్
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి, సోను సూద్, ముకుల్ దేవ్, సాయాజీ షిండే, నాగి నీదు, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, చలపతి రావు,కె.విశ్వనాధ్, ఎం.ఎస్.నారాయణ, రఘు బాబు,వెన్నెల కిషోర్,అజయ్, ఆదిత్య మీనన్, తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : వీర భద్రం చౌదరి
ప్రొడ్యూసర్ : అక్కినేని నాగార్జున
రిలీజ్ డేట్ : 25 అక్టోబర్ 2013

నాగార్జున కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘భాయ్’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాణం లో దర్శకుడు వీరభద్రం తెరకెక్కిన ఈ చిత్రం లో భాయ్ గా నాగార్జున నటన, యాక్షన్ ఎపిసోడ్, రీచా గంగోపాధ్యాయ్ గ్లామర్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్స్. ఈ చిత్రం లో బ్రహ్మానందం, రఘు బాబు, వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తుంది.

——————————————————————

amaravathi
నటీ నటులు : స్నేహ, భూమిక, తారకరత్న, సింధూర గద్దె, రవి బాబు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : రవి బాబు
ప్రొడ్యూసర్ : ఆనంద్ ప్రసాద్
రిలీజ్ డేట్ : 3 డిసెంబర్ 2009

థ్రిల్లర్ సస్పెన్స్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచే దర్శకుడు రవి బాబు తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘అమరావతి’. ఈ చిత్రం లో భూమిక, స్నేహ ల నటన, సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలు, రవి బాబు టేకింగ్, నందమూరి తారక రత్న క్యారెక్టర్ సినిమాకు హైలైట్స్. ఈ సినిమా కోసం తొలి సారిగా విలన్ అవతారమెత్తిన తారకరత్న ఈ చిత్రం లో నటన కు గాను నంది అవార్డు అందుకున్నారు. ఆధ్యాంతం సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలతో ఈ సినిమా అలరిస్తుంది.