జనవరి దాకా నో ఛాన్స్

Monday,November 28,2016 - 04:30 by Z_CLU

పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేసినా, ఒక సినిమాకి ప్యాకప్ చెప్పనిదే ఇంకో సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్ళేలా కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ ని సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్, కాటమరాయుడు కంప్లీట్ అయిన తర్వాతే… పవన్ తో కలిసి సెట్స్ పైకి వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు.

కాటమరాయుడు సినిమాకు డిసెంబర్ నాటి ప్యాకప్ చెప్పాలని ప్లాన్ చేస్తున్న పవన్ కళ్యాణ్, జనవరిలో నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. త్రివిక్రమ్ సినిమాలో మేకోవర్ కోసం వారం కన్నా ఎక్కువ టైం తీసుకోవడం ఇష్టంలేని పవర్ స్టార్, కాటమరాయుడు షూటింగ్ టైంలో బ్రేక్ దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ తో సినిమా డిస్కషన్స్ లో బిజీగా ఉంటున్నట్టు ఇన్ సైడ్ సోర్సెస్ నుంచి సమాచారం.