Balakrishna Akhanda - స్పెషల్ ట్రైలర్ ఆరోజే ?

Monday,May 24,2021 - 02:53 by Z_CLU

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న ‘అఖండ’ సినిమాకు సంబంధించి మరో 15 రోజుల్లో ట్రైలర్ రాబోతుంది. అవును.. బాలకృష్ణ పుట్టిన రోజు నాడు జూన్ 10న సినిమా ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. బాలయ్య కి విషెస్ చెప్తూ రిలీజ్ చేయబోయే ఈ ట్రైలర్ వర్క్ జరుగుతుందని ఆన్లైన్ ద్వారా బోయపాటి అండ్ టీం దీనిపై కొ ఆర్డినేట్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే సినిమా నుండి రెండు టీజర్స్ వదిలారు మేకర్స్. సంక్రాంతి కి వదిలిన టీజర్ తో పాటు లేటెస్ట్ గా బాలయ్య అఘోర గెటప్ తో ఉన్న డైలాగ్ టీజర్ కూడా అందరినీ ఆకట్టుకుంది. రిలీజైన తక్కువ టైంలో రెండో టీజర్ 50 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొని 60 మిలియన్ వ్యూస్ చేరువలో ఉంది. ఇప్పుడు బాలయ్య పుట్టిన రోజు నాడు రానున్న ట్రైలర్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ఈసారి బాలయ్య క్యారెక్టర్ తో ఎలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ వదలనున్నారో అని బాలయ్య ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

  • pragya jaiswal

                                ప్రగ్యా జైశ్వాల్

ద్వారక క్రియేషన్స్ బేనర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య ద్వీపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. పంచె కట్టులో మాస్ క్యారెక్టర్ లో నటిస్తూనే మరోవైపు అఘోరా గెటప్ లో డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు బాలయ్య. బాలయ్య సరసన పూర్ణ , ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో మూడో సినిమాగా వస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో దసరా కానుకగా థియేటర్స్ లోకి రానుందని సమాచారం.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics