Krithi Shetty - అలాంటి వాడంటే ఇష్టం!

Monday,May 24,2021 - 01:34 by Z_CLU

Krithi Shetty Personal interests
ఉప్పెన అనే ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ తో క్రేజీ హీరోయిన్ అయిపోయింది కృతి షెట్టి. అయితే ఆమె మీడియాలో కనిపించింది చాలా తక్కువ. ఇంటర్వ్యూలు కూడా చాలా తక్కువ. దీంతో ఆమె ఇష్టాఇష్టాలు, పర్సనల్
విషయాలు లాంటివి ఎవ్వరికీ ఏం తెలియవు.

తను చేస్తున్న సినిమాలకు సంబంధించి తాజాగా క్లారిటీ ఇచ్చిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా కొన్ని వ్యక్తిగత విషయాల్ని కూడా పంచుకుంది. మరీ ముఖ్యంగా మగాళ్లలో ఎలాంటి వాళ్లు తనకు ఇష్టమో బయటపెట్టింది.

krithi shetty zeecinemalu

                                     హీరోయిన్ కృతి షెట్టి

కృతి షెట్టి మాటల్లోనే చెప్పాలంటే.. “మాటల్లో నిజాయితీగా ఉంటూ, నన్ను కించపరచకుండా ఉండే వ్యక్తులంటే నాకు ఇష్టం. నన్ను అగౌరవంగా చూస్తే నేను తట్టుకోలేను. ఎవరితోనైనా డేటింగ్ చేయాల్సి వస్తే ముందుగా నేను కోరుకునేది ఈ లక్షణాలే.” ఇలా తన మనసులో మాట బయటపెట్టింది కృతిషెట్టి.

ఇక ఉప్పెన జ్ఞాపకాల్ని పంచుకుంటూ.. తనను హీరో వైష్ణవ్ తేజ్ బాగా ఆటపట్టించేవాడని చెప్పుకొచ్చింది. 120 రోజులు షూటింగ్ చేస్తే దాదాపు ప్రతి రోజూ తనను టీజ్ చేసేవాడని, తనను ఇప్పటివరకు ఎవ్వరూ అంతలా ఏడిపించలేదని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నాని సరసన శ్యామ్ సింగరాయ్ అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు సుధీర్ బాబు సరసన ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా, రామ్ సరసన లింగుసామి దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ 3 సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. వీటిలో ఏది ముందుగా మొదలైతే, ఆ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది కృతి షెట్టి.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics