చిరు కి టైటిల్ ఫిక్స్...

Friday,March 10,2017 - 04:00 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టేశాడు… లేటెస్ట్ గా ‘ఖైదీ నంబర్ 150’ తో రి ఎంట్రీ ఇచ్చిన చిరు రి ఎంట్రీ కి వచ్చిన గ్రాండ్ వెలకమ్ తో కాస్త జోష్ పెంచి నెక్స్ట్ సినిమాను సెట్స్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు…

ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్న ఈ సినిమాను రామ్ చరణ్ పుట్టినరోజున అనౌన్స్ చేయాలనీ చూస్తున్నారు.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్ ‘ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి’ కథతో తెరకెక్కనున్న ఈ సినిమా కి ఆయన పేరునే టైటిల్ గా పెట్టాలని డిసైడ్ అయ్యారట యూనిట్.. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందనున్న   ఈ సినిమా కోసం లేటెస్ట్ గా ‘ఉయ్యాల వాడ నర్సింహా రెడ్డి’ టైటిల్ ను  రిజిస్టర్ చేయించాడట చరణ్. సో చిరు నెక్స్ట్ ఈ పవర్ ఫుల్ టైటిల్ తో ఆడియన్స్ ఎంటర్టైన్ చేయబోతున్నాడన్నమాట.. మరి ఈ సినిమా షూటింగ్ మరియు ఇతర విశేషాలు గురించి తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..