పరిణీతి కోసం ప్రయత్నాలు

Wednesday,December 07,2016 - 06:00 by Z_CLU

కారణం పెద్దగా తెలీదు కానీ మేహేష్ డైరెక్టర్స్ మాత్రం పరిణీతి కోసం ప్రయత్నాలు మానడం లేదు. మొన్నటి వరకు మురుగదాస్ సినిమాలో ఎట్టి పరిస్థితుల్లో పరిణీతి చేత సంతకం చేయించుకోవాల్సిందేనని నిక్కచ్చిగా ట్రై చేసినా వర్కవుట్ కాలేదు. మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కొరటాల శివ సినిమా విషయం లోను అదే జరిగింది.

ఆ రెండు సినిమాలకు పరిణీతి ఎందుకు నో చెప్పిందో తెలియరాలేదు కానీ, ఈ సారి మహేష్, వంశీ పైడిపల్లి  సినిమాలో పరిణీతి చోప్రా కన్ఫం అయింది అనే టాక్ హాట్ హాట్ గా చక్కర్లు కొడుతుంది. ఫిలిం మేకర్స్ అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు.

నిజానికి పరిణీతి ఈ సినిమాలో నటిస్తుందనే టాక్ లో నిజముందో లేదో తెలీదు కానీ, మన డైరెక్టర్స్ కి మాత్రం, మహేష్ కి పరిణీతి చోప్రానే పర్ ఫెక్ట్ ఆన్ స్క్రీన్ జోడి అని స్ట్రాంగ్ ఫీలింగ్. ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం.