రామ్ చరణ్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Wednesday,December 07,2016 - 08:56 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా ‘ధృవ’. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా రామ్ చరణ్ మీడియా తో మాట్లాడారు ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…

*టెన్షన్ కి కారణం అదే…

సహజంగా ప్రతీ సినిమా రిలీజ్ కి ముందు టెన్షన్ ఉంటుంది. అందులోకి ఇది రీమేక్ సినిమా కావడంతో కాస్త కాన్ఫిడెంట్ అలాగే టెన్షన్ కూడా ఉంది. రిలీజ్ తరువాత ఒరిజినల్ కి రీమేక్ కి తేడా గమనించడం మామూలే. అందుకే ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా అంత కంటే బెటర్ గానే తీశామనే కాన్ఫిడెంట్ ఉంది…

*ఎప్పుడో చెయ్యాలి కానీ ఇప్పుడు కుదిరింది..

కథ కు తగ్గట్టు గా కనిపిస్తేనే ఏ క్యారెక్టర్ అయినా వర్కౌట్ అవుతుంది. ఒరిజినల్ సినిమా చూడగానే ఈ క్యారెక్టర్ కి ఖచ్చితంగా సిక్స్ ప్యాక్ అవసరం అనిపించింది. అందుకే వెంటనే వర్కౌట్స్ స్టార్ట్ చేసి స్పెషల్ డైట్ తీసుకొని ఫిజికల్ గా స్ట్రాంగ్ అయ్యాకే సిక్స్ ప్యాక్ తో సెట్స్ పైకి వెళ్ళా. ఎప్పుడో చెయ్యాలి కానీ కాస్త లేట్ అయ్యి ఈ సినిమాకు కుదిరింది..

ram-charan-gym

*అలాంటివి పట్టించుకోను..

ఈ రీమేక్ చేయడానికి మెయిన్ రీసన్ కథ ,స్క్రీన్ ప్లే బాగా నచ్చడమే. ఈ రీమేక్ చేస్తే బాగుంటుందని ప్రసాద్ గారు చెప్పగానే సినిమా చూసా. వెంటనే ఫిక్స్ అయిపోయా. పైగా తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా కావడం తో మిగతావేం ఆలోచించలేదు. హీరోగా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చెయ్యడమే ఫైనల్ టార్గెట్ కదా. అలాంటప్పుడు రీమేక్ అయితే ఏంటి… అలాంటివి అస్సలు పట్టించుకోను…

 

*ఛాయిస్ లేదు…

ఈ సినిమాలో అరవింద్ స్వామి గారి క్యారెక్టర్ తెలుగు లో ఎవరు చేస్తే బాగుంటుందా? అని ఆలోచించాం మాకు వేరే ఛాయిస్ కనిపించలేదు. పైగా తమిళ్ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ఆయన క్యారెక్టరే కారణం. అందుకే ఆయనకే ఫిక్స్ అయ్యాం. మొదట సెట్స్ లో ఆయనతో నటించడం కొంచెం టెన్షన్ గా అనిపించింది. ఆ తరువాత మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. తెలుగు లో కూడా ఆయన క్యారెక్టర్ హైలైట్ అవుతుందనే నమ్మకం ఉంది.

ram-charan-44
*ప్రతీ ఏడాది కొత్తగా…

హీరోగా ఎప్పటి కప్పుడు కొత్త రకంగా కనిపించాలని అనుకుంటా. అందుకే ప్రతీ సినిమాకు ఏదో ఒక కొత్త వేరియేషన్ చూపిస్తూ ముందుకెళ్తున్నా. ఈ సినిమా విషయం లోన్ కూడా అదే ఫాలో అయ్యాను.

*నో చేంజెస్

ఒరిజినల్ కి ‘ధృవ’ కి ఎలాంటి మార్పు ఉండదు కానీ సురేందర్ రెడ్డి కాస్త తెలుగు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేలా మేకింగ్ లో ఛేంజెస్ చూపించారు. కంటెంట్ విషయం లో ఎలాంటి మార్పులు చేయకుండానే సెట్స్ పైకి వెళ్లిపోయాం.

*ఆ విషయంలో నో ఛాయిస్…

ఈ సినిమాకు ఏ హీరోయిన్ అయితే బాగుంటుందా? అనుకున్నాం. కానీ ఈ విషయం లో మరో చాయిస్ కనిపించలేదు. ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’ లో రకుల్ పెర్ఫార్మెన్స్ చూసి ఈ క్యారెక్టర్ కి రకుల్ అయితేనే పెర్ఫెక్ట్ అనుకొని వేరే ఛాయిస్ వెతకకుండా రకుల్ కె ఫిక్స్ అయిపోయాం. తన గ్లామరస్ యాక్టింగ్ తో అందరినీ డెఫినెట్ గా ఎంటర్టైన్ చేస్తుంది.

ram-charan-52
*కొత్తగా ఉండడం కోసమే

ఈ సినిమాకు ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హప్ తమిళ నే సెలెక్ట్ చేయడానికి పెద్దగా రీసన్ ఏం లేదు. ఓ పాతికేళ్ల కుర్రాడు కొత్త మ్యూజిక్ అందిస్తుంటే ఎంకరేజ్ చేయాలనిపించింది. పైగా ఒరిజినల్ కి తన మ్యూజిక్ చాలా ప్లస్ అవ్వడం, మన ఆడియన్స్ కి కూడా తన మ్యూజిక్ కొత్తగా అనిపిస్తుందని ఫీలయ్యాం. లేటెస్ట్ గా రిలీజ్ అయినా ఆడియో కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్.ఆర్ కూడా అద్భుతంగా అందించాడు.

 

*నేనే ఒప్పించా

రీమేక్ అనగానే కొందరు డైరెక్టర్స్ పెద్దగా ఇంటరెస్ట్ చూపరు. అందుకు మెయిన్ రీసన్ వేరే డైరెక్టర్ కథను ఓన్ చేసుకొని డైరెక్ట్ చెయ్యడం అంటే చాలా కష్టమనే చెప్పాలి. సురేందర్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. ముందు ఈ రీమేక్ సినిమా టెక్ అప్ చేయడం తనకి అస్సలు ఇంటరెస్ట్ లేదు నేనే బలవంతంగా ఒప్పించా. కానీ సినిమా సెట్స్ పైకి వెళ్ళాక మా అందరి కంటే తనే ఎక్కువగా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యాడు.

ram-charan-24

*నాన్న సినిమాలో అలా కనిపిస్తా..

ప్రస్తుతం నాన్న గారు నటిస్తున్న ఖైదీ నంబర్ కి నేనే ప్రొడ్యూసర్ అయినప్పటికీ వినాయక్ గారే ఎక్కువగా కేర్ తీసుకుంటూ వర్క్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే డైరెక్షన్ తో పాటు ప్రొడక్షన్ కూడా ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. అందుకే నిర్మాతగా నాకు పెద్ద టెన్షన్ లేదు. ఇక ప్రెజెంట్ సాంగ్ షూట్ జరుగుతుంది. రేపటి తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ సాంగ్ లో నాన్నతో కలిసి ఓ బీ.జి.ఎం లో కనిపిస్తా. కేవలం ఈ సాంగ్ లో మాత్రమే కనిపిస్తా.

 

*ప్రస్తుతం నా ఫోకస్ ఇక్కడే

గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేయాలని డిసిషన్ తీసుకున్నా. ఇక సుకుమార్ తో నా నెక్స్ట్ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ రిలీజ్ తరువాత జనవరి లోనే స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా తరువాత కొరటాల శివతో కూడా సినిమా ఉంటుంది. ఇక వచ్చే ఏడాదే బాబాయ్ ప్రొడక్షన్ లో నటించే సినిమా కూడా ఉంటుంది. ప్రెజెంట్ వేరే లాంగ్వేజ్ లో సినిమా చేసే ఆలోచన లేదు. ఫోకస్ అంతా ఇక్కడే..

ram-charan-12
*ఇంకా చూడలేదు.

ప్రస్తుతం నాన్న ఇంకా ఈ సినిమా చూడలేదు. ఖైదీ నంబర్ 150 షూట్ లో బిజీ గా ఉన్నారు. రేపు లేదా ఎల్లుండే ఈ సినిమా చూస్తారు.

* ధృవ  డెఫినెట్ గా ఎంటర్టైన్ చేస్తుంది

మన ఆడియన్స్ ను కూడా ఈ కథ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని బలంగా నమ్ముతున్నా. మా టీం అందరం ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాం.