అశోక్ గ‌ల్లా కొత్త సినిమా ఫస్ట్ లుక్

Monday,April 06,2020 - 01:04 by Z_CLU

గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా కుమారుడు అశోక్ గ‌ల్లా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న విష‌యం విదిత‌మే. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ డిఫరెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, స‌త్యా, అర్చ‌నా సౌంద‌ర్య కీల‌క పాత్ర‌ధారులు.

ఈ సినిమాకు సంబంధించి 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధం, లాక్‌డౌన్ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అయితే ఈ గ్యాప్ లో అశోక్ గ‌ల్లా బర్త్ డే సందర్భంగా ఆయ‌న ఫస్ట్ లుక్‌ను నిర్మాత‌లు విడుద‌ల చేశారు.

టేబుల్‌పై కూర్చొని టేబుల్‌ ల్యాంప్ వెలుగులో దీక్ష‌గా పుస్త‌కం చ‌దువుతున్న అశోక్ లుక్ ఆక‌ట్టుకుంటోంది. సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, గ‌ల్లా అరుణ‌కుమారి సంయుక్తంగా స‌మ‌ర్పిస్తోన్న ఈ చిత్రానికి చంద్ర‌శేఖ‌ర్ రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, జిబ్రాన్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు.

తారాగ‌ణం:
అశోక్ గ‌ల్లా, నిధి అగ‌ర్వాల్‌, జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, స‌త్యా, అర్చ‌నా సౌంద‌ర్య‌

సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌కత్వం: శ్రీ‌రామ్ ఆదిత్య టి.
నిర్మాత‌: ప‌ద్మావ‌తి గ‌ల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: చ‌ంద్ర‌శేఖ‌ర్ రావిపాటి
సంగీతం: జిబ్రాన్‌
బ్యాన‌ర్‌: అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌