పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కీర్తిసురేష్

Monday,April 06,2020 - 01:30 by Z_CLU

కీర్తిసురేష్ త్వరలోనే పెళ్లి చేసుకుంటుందట
చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడనుందట
2 రోజుల నుంచి వినిపిస్తున్న పుకార్లు ఇవి. ఎట్టకేలకు వీటిపై ఈ “మహానటి” క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లికి ఇంకా టైమ్ ఉందని, ప్రస్తుతం వినిపిస్తున్నవన్నీ రూమర్లే అని క్లారిటీ ఇచ్చింది కీర్తిసురేష్.

జీవితంలో తప్పకుండా పెళ్లి చేసుకుంటానంటోంది కీర్తిసురేష్. అది కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లి మాత్రమే చేసుకుంటానని చెబుతోంది. అయితే దానికింకా టైమ్ ఉందని, ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని చెబుతోంది. మరిన్ని తెలుగు, తమిళ సినిమాల్లో నటించాలనుకుంటోంది ఈ భామ.

ప్రస్తుతం తెలుగులో కీర్తిసురేష్ నటించిన మిస్ ఇండియా సినిమా విడుదలకు సిద్ధమైంది. దీంతో పాటు నితిన్ హీరోగా రంగ్ దే అనే మరో సినిమా కూడా చేస్తోంది కీర్తిసురేష్.