అనీల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు

Monday,April 06,2020 - 12:58 by Z_CLU

ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తీసిన దర్శకుడు అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీ ఏంటనేదానిపై ఇంతవరకు ఏ విషయం బయటకు చెప్పలేదు. ప్రస్తుతం అభిమానులంతా ఈ యంగ్ టాలెంటెడ్ దర్శకుడు ఎలాంటి సినిమా… ఎవరితో తీస్తాడనేదానిపై ఆసక్తిగా ఉన్నారు.

కరోనా వైరస్ ను నియంత్రించడానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో అనిల్ రావిపూడి తన సమయాన్ని అంతా ఇప్పుడు తదుపరి స్క్రిప్ట్ మీదే పెట్టాడు. కొత్త చిత్రం స్క్రిప్ట్ పూర్తి చేయడంపైనే కేటాయించాడు. అదే ఎఫ్3.

పోయిన సంవత్సరం వచ్చిన ఎఫ్2 బిగ్గెస్ట్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి కొనసాగింపుగా అనిల్ రావిపూడి ఎఫ్3 సిద్ధం చేస్తున్నాడు. ఈ కొత్త చిత్రంలో ఎఫ్2ను మించిన ఎంటర్ టైన్ మెంట్ ఉండబోతోంది.

ప్రస్తుతం అనిల్ రావిపూడి తన రచనా బృందంతో కలిసి తన ఇంట్లోనే స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడు. నిన్న రాత్రి 9 గంటలకు తన ఎఫ్3 రైటర్స్ టీమ్ తోనే సెల్ ఫోన్ లో ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు.