బ్లాక్ బస్టర్: వీరరాఘవుడి 100 కోట్ల పరాక్రమం

Sunday,October 14,2018 - 11:55 by Z_CLU

యంగ్ టైగర్ ప్రభంజనం మరోసారి అందరికీ తెలిసొచ్చింది.. అరవింద సమేత సినిమా థియేటర్లలో అరివీర భయంకరంగా ఆడుతోంది. రోజురోజుకు కళ్లుచెదిరే వసూళ్లు సాధిస్తూ రికార్డుల మీద రికార్డు సృష్టిస్తున్నాడు ఎన్టీఆర్. ఇందులో భాగంగా విడుదలైన 3 రోజులకే అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు.

అవును.. అరవింద సమేత సినిమా 3 రోజుల్లోనే వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. త్రివిక్రమ్ డైరక్ట్ చేసిన ఈ సినిమా అన్ని సెంటర్లలో రికార్డు వసూళ్లు సాధిస్తోంది. అటు ఓవర్సీస్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫలితంగా గురువారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా 3 రోజులకే వంద కోట్ల గ్రాస్ సాధించింది.

ఈ దసరాకు సిసలైన సినిమాగా నిలిచింది అరవింద సమేత. పేరుకు ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కినప్పటికీ… మూవీ కాన్సెప్ట్, మహిళలకు ఇచ్చిన గౌరవం వల్ల కుటుంబ సమేతంగా అంతా చూడదగ్గ చిత్రంగా నిలిచింది. ఎన్టీఆర్ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ కు తోడు, త్రివిక్రమ్ డైలాగ్స్ కోసం ఈ సినిమాను రిపీటెడ్ గా చూస్తున్నారు ఆడియన్స్.