నాని 'జెర్సీ'... కీలక పాత్రలో ప్రముఖ నటుడు

Sunday,October 14,2018 - 11:08 by Z_CLU

నాని నెక్స్ట్ సినిమా ‘జెర్సీ’ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకొని షూటింగ్ రెడీ అవుతుంది.. దసరా నుండి సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో నాని సరసన శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా ఎంపికైంది.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో సత్య రాజ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది.

క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సత్య రాజ్ నాని కి కోచ్ గా నటించనున్నాడని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మించనున్న ఈ సినిమాకు గౌతం తిన్ననూరి దర్శకుడు. అక్టోబర్ నుండి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది.