ఓవర్సీస్ లో ఎన్టీఆర్ అరుదైన రికార్డు

Sunday,October 14,2018 - 12:05 by Z_CLU

దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ సినిమాలున్నాయి. తమ హిట్ సినిమాలతో అంతా 10లక్షల డాలర్లు అర్జించిన వాళ్లే. అయితే 1.5 మిలియన్ డాలర్ క్లబ్ విషయానికొచ్చేసరికి ఈ లిస్ట్ చాలా చిన్నదిగా మారిపోతుంది. ఈ క్లబ్ లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అలాంటి క్లబ్ ను వరుసగా 4 సార్లు రిపీట్ చేస్తే ఎలా ఉంటుంది

సరిగ్గా యంగ్ టైగర్ అదే పని చేశాడు. లేటెస్ట్ మూవీ అరవింద సమేతతో మరోసారి 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి తనకు తానే సాటి అనిపించుకున్నాడు. అరవింద సమేతతో కలుపుకొని వరుసగా ఇలా నాలుగోసారి ఈ ఘనత సాధించాడు ఎన్టీఆర్.

ఇంతకుముందు ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ సినిమాలు ఓవర్సీస్ లో 1.5 మిలియన్ డాలర్లు ఆర్జించాడు. ఇప్పుడు వరుసగా నాలుగోసారి అరవింద సమేత కూడా ఆ ఘనత సాధించి ఎన్టీఆర్ స్టామీనాను ప్రూవ్ చేసింది. ఇలా 4 సార్లు 1.5 మిలియన్ డాలర్ వసూళ్లు సాధించిన హీరో సౌత్ లో యంగ్ టైగర్ ఒక్కడే.