ఆ డేట్ పై కన్నేసిన నారా రోహిత్...

Thursday,December 15,2016 - 09:00 by Z_CLU

ఏడాది కి మూడు సినిమాలతో ఎంటర్టైన్ చేసే నారా రోహిత్ ఈ ఏడాది మరో సినిమాతో రెడీ అయ్యాడు. ఈ ఏడాది ‘సావిత్రి’, ‘తుంటరి’,’జ్యో అచ్యుతానంద’ సినిమాలతో ఎంటర్టైన్ చేసిన నారా రోహిత్ ఇదే ఏడాది మరో సినిమా తో థియేటర్స్ లో అడుగుపెట్టబోతున్నాడు. సాగ‌ర్ కె.చంద్ర డైరెక్షన్ లో హీరోగా నటించిన ‘అప్పట్లో ఒకడుండే వాడు’ సినిమా తో డిసెంబర్ ఎండింగ్ లో ఎంటర్ అవ్వబోతున్నాడు.

appatlo-okadundevadu-firstlook-posters1

ఇక ఇదే డేట్ కి అల్లరి నరేష్ ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’ సినిమాతో థియేటర్స్ లోకి వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ డేట్ దాటి తే మరో రెండు నెలల వరకూ థియేటర్స్ కొరత ఉండడం తో ఇదే రైట్ టైం అనుకోని తన సినిమా ను డిసెంబర్ బరి దింప బోతున్నాడు నారా వారి అబ్బాయి. మరి ఈ సినిమాతో రోహిత్ ఎలాంటి హిట్ అందుకుంటాడో? చూడాలి ..