భాగమతి ఫస్ట్ వీక్ వసూళ్లు

Saturday,February 03,2018 - 10:54 by Z_CLU

అనుష్క లీడ్ రోల్ లో నటించిన భాగమతి సినిమా ఫస్ట్ వీక్ మంచి వసూళ్లు సాదించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు అశోక్ దర్శకుడు. తమన్ సంగీతం అందించాడు. జనవరి 26న విడుదలైన ఈ సినిమా మొన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఈ 7 రోజుల్లో భాగమతి సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, నైజాం ఫస్ట్ వీక్ షేర్

నైజాం – రూ. 6.45 కోట్లు
సీడెడ్ – రూ. 2.25 కోట్లు
నెల్లూరు – రూ. 0.70 కోట్లు
గుంటూరు – రూ. 1.30 కోట్లు
కృష్ణా – రూ. 1.16 కోట్లు
వెస్ట్ – రూ. 0.90 కోట్లు
ఈస్ట్ – రూ. 1.32 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.07 కోట్లు

మొత్తం షేర్ – 16.15 కోట్లు