సోషల్ మీడియాలో రంగస్థలం రికార్డులు

Saturday,February 03,2018 - 11:44 by Z_CLU

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన టీజర్, తాజాగా 15 మిలియన్ వ్యూస్ నమోదు చేసింది. ఒక తెలుగు సినిమా టీజర్ ను కోటిన్నర మంది వీక్షించడం అంటే అది సాధారణ విషయం కాదు. రంగస్థలం సినిమాపై ఎన్ని అంచనాలున్నాయో చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే.

రంగస్థలం సినిమాలో చిట్టిబాబు అనే చెవిటి వాడి పాత్రలో కనిపించబోతున్నాడు రామ్ చరణ్. 1985 నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో ఓ పెద్ద ప్రయోగం. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యూల్ నడుస్తోంది.  ఫిబ్రవరి 13న సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 30న రంగస్థలం సినిమా రిలీజ్ అవుతుంది.