భాగమతి మూవీ ఫైనల్ కలెక్షన్స్

Thursday,March 01,2018 - 02:30 by Z_CLU

అనుష్క లీడ్ రోల్ పోషించిన భాగమతి సినిమా థియేటర్లలో తన కంప్లీట్ రన్ పూర్తిచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా నడిచిన ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో బ్రేక్-ఈవెన్ సాధించింది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 27 కోట్ల రూపాయల నెట్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అటుఇటుగా 20 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. అశోక్ ఈ సినిమాకు దర్శకుడు. భాగమతి సినిమా క్లోజింగ్ కలెక్షన్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

నైజాం – రూ. 8.05 కోట్లు
సీడెడ్ – రూ. 2.80 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.75 కోట్లు
గుంటూరు – రూ. 1.55 కోట్లు
ఈస్ట్ – రూ. 1.62 కోట్లు
వెస్ట్ – రూ. 1.10 కోట్లు
కృష్ణా – రూ. 1.45 కోట్లు
నెల్లూరు – రూ. 0.88 కోట్లు