Adipurush - క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Wednesday,September 30,2020 - 12:27 by Z_CLU

#Prabhas22 సినిమాగా రాబోతున్న ‘Adipurush’ వచ్చే ఏడాది జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. రామాయణంలోని ఘట్టాలతో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో Prabhas రాముడిగా కనిపించనున్నాడు. Saif Ali Khan రావణుడిగా నటించాడు. అయితే సినిమాలో కీలకమైన సీత పాత్రలో ఎవరు నటిస్తారనేది క్లారిటీ లేదు.

ఇప్పటికే Adipurush లో సీత పాత్రకు కొందరు Heroines పేర్లు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా Anushka పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ విషయం పై లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది అనుష్క. ఆ సినిమాకు సంబంధించి ఇంకా ఎవ్వరూ తనను సంప్రదించలేదని అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేసింది.

ఈ లాక్ డౌన్ టైమ్ లో 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనుష్క. అందులో ఒక సినిమా జనవరి నుంచి సెట్స్ పైకి రాబోతోంది. త్వరలోనే ఆ మూవీ డీటెయిల్స్ తెలుస్తాయి