నాగచైతన్యతో నితిన్ దర్శకుడు

Wednesday,September 30,2020 - 12:35 by Z_CLU

NagaChaitanya హీరోగా Vikram Kumar డైరెక్షన్ లో Thank You అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే… ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా తర్వాత చైతూ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.

తాజా అప్డేట్ ప్రకారం Venky Atluri చైతుకి ఓ లవ్ స్టోరీ చెప్పాడట. ప్రస్తుతం Nithiin తో ‘RangDe’ చేస్తున్న వెంకీ… చైతు నుండి గ్రీన్ సిగ్నల్ అందుకొని స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది.

సో.. అన్ని అనుకున్నట్లు జరిగితే NagaChaitanya-VenkyAtluri కాంబోలో సినిమా రాబోతోంది. ఆ తర్వాత దర్శకుడు పరశురామ్తో Nageswara Rao ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్తాడు చైతూ.