Anushka - క్రేజీ ఫొటో వెనక కథ చెప్పిన బొమ్మాలి

Monday,October 05,2020 - 01:41 by Z_CLU

ఈ ఫొటో చూశారా.. Prabhas-Anushkaపై జాయింట్ గా పుకార్లు వచ్చిన ప్రతిసారి వైరల్ అయ్యే స్టిల్ ఇది. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారట, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారంట అంటూ గాసిప్స్ వచ్చినప్పుడల్లా ఈ ఫొటోనే ట్రెండ్ అవుతుంటుంది. ఇప్పుడీ ఫొటోపై స్వయంగా అనుష్క రియాక్ట్ అయింది.

ఫ్యాన్స్ తో ఛాట్ సెషన్ లో పాల్గొన్న అనుష్కను.. ఓ అభిమాని ఈ ఫొటో గురించి అడిగాడు. దీనిపై మీ స్పందనేంటి అని ప్రశ్నించాడు. దానికి Anushka చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది.

“షాట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు తీసిన మంచి ఫొటో ఇది. మిర్చి సినిమా పోస్టర్లలో ఈ స్టిల్ వాడారు. ఆ సినిమా ఎప్పుడూ నా మనసుకు దగ్గరగా ఉంటుంది. పైగా యూవీ క్రియేషన్స్ ఫస్ట్ మూవీ అది.”

ఇలా అసలు మేటర్ చెప్పకుండా టాపిక్ ను పక్కదోవ పట్టించింది అనుష్క. అయితే ఆ ఫొటోను ఏ సందర్భంలో తీశారనే గమ్మత్తైన విషయాన్ని మాత్రం ఆమె బయటపెట్టింది. నిజానికి ఫొటో కోసం ఇచ్చిన పోజు కాదట అది. ఏదో షాట్ గురించి మాట్లాడుకుంటుంటే, అలా తీసేశారట.

అనుకోకుండా తీసిన ఫొటోలే బాగా క్లిక్ అవుతాయంటారు. ఇది కూడా అలాంటిదే.