ఈ సినిమాతో సంగతేంటో తేలిపోతుంది

Thursday,April 11,2019 - 02:02 by Z_CLU

ఆల్మోస్ట్ అమ్మడు కరియర్ అయిపోయిందన్న టైమ్ లో మళ్ళీ బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’ సినిమాలో ఫిక్సయింది అనుపమ. ప్రస్తుతానికి ఈ సినిమా తప్ప అనుపమ చేతిలో ఇంకో సినిమా లేదు. అయితే ఈ ‘రాక్షసుడు’ అనుపమకి మరిన్ని సినిమాల ఆఫర్లు తెచ్చిపెడుతుందా..? ఈ ఒక్క సినిమా అనుపమ కరియర్ ట్రాక్ మార్చేసే స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా అనేది క్వశ్చన్ మార్కే. 

కరియర్ బిగినింగ్ లో ‘అ..ఆ..’, ‘శతమానం భవతి’ లాంటి సినిమాలు పడ్డా టాప్ ప్లేస్ కి కనీసం దగ్గరలో ఉందనే ఒపీనియన్ కూడా దక్కించుకోలేదు అనుపమ. మరీ కమర్షియల్ హీరోయిన్ స్థాయికి వెళ్లకపోయినా, గట్టిగా పర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ని ఎంచుకోలేకపోవడం, అనుపమని ఒక్కసారిగా వెనక్కి నెట్టేశాయి.

నిజంగా అవకాశాలు రావట్లేదా..? లేకపోతే స్క్రిప్ట్స్ ని ఎంచుకోవడంలో తనే జాప్యం చేస్తుందా..? లాంటి క్వశ్చన్స్ కి ఎగ్జాక్ట్ ఆన్సర్స్ ఇప్పట్లో దొరకవు కానీ, ‘రాక్షసుడు’ సినిమాపై మాత్రం గంపెడు ఆశలు పెట్టుకుని ఉంది అనుపమ.

తమిళంలో సూపర్ హిట్ కాబట్టి ఇక్కడ కూడా సినిమా సక్సెస్ అవుతుందనే ధీమా ఓ వైపు, రొటీన్ సినిమా కాదు కాబట్టి ఈ సినిమాతో తగ్గిపోయిన క్రేజ్ ని ఎలాగోలా సంపాదించేసుకోవాలని ఫిక్సయి ఉంది అనుపమ. థ్రిల్లర్ కాబట్టి… అందునా పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న చాన్సులు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి, అనుపమ ప్లాన్ వర్కవుట్ అయ్యే సూచనలయితే కనిపిస్తున్నాయి. కానీ అసలు రిజల్ట్స్ తేలాలంటే సినిమా రిలీజవ్వాల్సిందే. అప్పటి వరకు ఏమీ చెప్పలేం.