నాని ‘జెర్సీ’ – అర్జున్ కాకుండా ఇంకేంటి...?

Thursday,April 11,2019 - 01:07 by Z_CLU

రేపు రిలీజవుతుంది నాని సినిమా ‘జెర్సీ’ ట్రైలర్. ఈ సినిమా నుండి చిన్న స్టిల్ రిలీజైనా ఎంతో ఎగ్జైటెడ్ గా రిసీవ్ చేసుకున్న ఫ్యాన్స్ ఈ ట్రైలర్ కోసం కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ ‘జెర్సీ’ సినిమాపై ఇప్పటికే క్రియేట్ అయిన ఎక్స్ పెక్టేషన్స్ కి మరిన్ని వింగ్స్ చేర్చనుంది. దానికీ ఓ కారణం ఉంది.

ఈ ట్రైలర్ రిలీజ్ కి సంబంధించి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మేకర్స్, ఈ ట్రైలర్ లో ఇప్పటి వరకు చూడని సరికొత్త యాంగిల్ ని ప్రెజెంట్ చేస్తున్నామని రివీల్ చేశారు. దాంతో క్రికెట్ కి మించిన ఎగ్జైటెడ్ ఎలిమెంట్ ఏంటా..? అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో రేజ్ అవుతుంది.

‘జెర్సీ’ సినిమాకి ఇప్పటి వరకు క్రియేట్ అయి ఉన్న ఇమేజ్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా. కానీ నిజానికి క్రికెట్ కి మించిన ఎమోషనల్ యాంగిల్ ‘జెర్సీ’ లో ఉండబోతుంది. ఆ పాయింట్ వరకు వచ్చేసరికి ఇప్పటి వరకు సస్పెన్స్ మెయిన్ టైన్ చేసిన మేకర్స్, రేపు రిలీజ్ అవుతున్న ఈ ట్రైలర్ లో సినిమాకి సంబంధించిన అసలు కథని చెప్పకనే చెప్పబోతున్నారని తెలుస్తుంది.

రియల్ క్రికెటర్ గా కనిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి, ట్రైనింగ్ తీసుకుని మరీ సెట్స్ పైకి వచ్చాడు నాని. సినిమాని ఎంత సీరియస్ గా తీసుకున్నాం అనేది ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో, సినిమాలోని క్రికెట్ యాంగిల్ నే ఎలివేట్ చేసిన మేకర్స్, రేపటి నుండి ‘జెర్సీ’ అసలు కథపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ తరవాత ‘జెర్సీ’ ఫీవర్ మరిన్ని రెట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.