రాశి ఖన్నా సినిమా అనుపమ చేతికి!

Saturday,February 23,2019 - 12:56 by Z_CLU

ఒక హీరోయిన్ కోసం అనుకున్న సినిమా మరో హీరోయిన్ చేతికి మారడం చాలా సహజం. మొన్నటికి మొన్న వెంకీ సినిమాలో రకుల్ ను అనుకుంటే చుట్టూ తిరిగి ఆ ఛాన్స్ రాశిఖన్నాకు వెళ్లింది. ఇప్పుడు రాశి ఖన్నా చేతిలో ఆఫర్ అనుపమ పరమేశ్వరన్ కు వెళ్లింది.

తమిళ్ లో హిట్ అయిన రాట్ససన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఓపెనింగ్ తో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఇందులో మొదట రాశిఖన్నాను హీరోయిన్ గా అనుకున్నారు. కట్ చేస్తే, ఆమె స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారు.

రాట్టసన్ సినిమాలో స్కూల్ టీజర్ గా కనిపించనుంది అనుపమ పరమేశ్వరన్. ఒరిజినల్ వెర్షన్ లో అమలాపాల్ పోషించిన పాత్ర ఇది. తమిళ్ లో ఈ సినిమా పెద్ద హిట్. తెలుగులో రమేశ్ వర్మ దర్శకత్వంలో రీమేక్ అవుతోంది.