క్షమాపణలు చెప్పిన స్టార్ కమెడియన్

Saturday,February 23,2019 - 03:12 by Z_CLU

తక్కువ టైమ్ లోనే కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఇలాంటి టైమ్ లో వచ్చిన మిఠాయి సినిమా ఇతడి ఇమేజ్ ను దెబ్బతీసింది.

దీంతో స్వయంగా రాహుల్ రంగంలోకి దిగాడు. సినిమా ఫ్లాప్ అయినందుకు అందరికీ క్షమాపణలు చెప్పాడు. మిఠాయి సినిమాకు తాము చేసిన రిపేర్లు మంచి ఫలితాన్ని ఇవ్వలేదంటూ ట్వీట్ చేశాడు
రాహుల్. సినిమా అవుట్ పుట్ ఇలానే ఉంటుందని తను ముందే ఊహించానని, నిన్న థియేటర్లలో చేదు అనుభవం చవిచూసిన ప్రేక్షకులందరికీ క్షమాపణలు కోరుతున్నానంటూ రాసుకొచ్చాడు. సినిమా డిజాస్టర్ అయినా ఆ దర్శకుడి ఆలోచనలు, ఊహలను గౌరవిస్తానంటున్నాడు రాహుల్.

ఒకప్పటిలా సినిమా ఫ్లాప్ అయితే దాన్ని కప్పిపుచ్చుకోవడం లేదు నటులు. ఓపెన్ గా ఒప్పుకుంటున్నారు. నోటా రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అయిందంటూ విజయ్ దేవరకొండ స్వయంగా ట్వీట్ చేశాడు. వినయ విధేయ రామ మెప్పించనందుకు ప్రేక్షకులకు రామ్ చరణ్ క్షమాపణలు కోరాడు. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ కూడా అదే పనిచేశాడు.