‘శైలజారెడ్డి అల్లుడు’ నుండి ఫస్ట్ వీడియో సాంగ్

Friday,August 10,2018 - 12:13 by Z_CLU

ఈ నెల 18 న గ్రాండ్ గా ఆడియో రిలీజ్ జరుపుకోనుంది ‘శైలజారెడ్డి అల్లుడు’ టీమ్. అయితే ఈ లోపు ఈ సినిమా నుండి ఫస్ట్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.   ‘అనూ బేబీ’ అంటూ సాగే ఈ సాంగ్ అక్కినేని ఫ్యాన్స్ లో సినిమాపై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ రేజ్ చేసేలా ఉంది.

నిమిషం పాటు ఉన్న ఈ వీడియో సాంగ్  సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తుంది. సినిమాలో నాగచైతన్య మోస్ట్ స్టైలిష్ గా కనిపిస్తాడన్న క్లారిటీ ఫస్ట్ లుక్ రిలీజైనప్పుడే వచ్చేసినా, ఈ సాంగ్ చూశాక నాగచైతన్య,  అనూ ఇమ్మాన్యువెల్ ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్బ్ అనిపిస్తుంది. కృష్ణకాంత్ లిరిక్స్ రాసిన ఈ పాటని అనుదీప్ దేవ్ పాడాడు.

మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ నాగ చైతన్య కి అత్తగా కనిపించనుంది. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఆగష్టు 31 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజవుతుంది.