యూరోప్ లో ప్రభాస్ ‘సాహో’ ఫైనల్ షెడ్యూల్

Friday,August 10,2018 - 02:06 by Z_CLU

ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది ప్రభాస్ సాహో. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కించే పనిలో ఉంది యూనిట్. అయితే ఈ షెడ్యూల్ తరవాత ఇమ్మీడియట్ గా  యూరోప్ కి వెళ్ళే ప్రిపరేషన్ లో ఉన్న సుజిత్ అండ్ టీమ్ ఫైనల్ షెడ్యూల్ అక్కడే తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారు.

డిసెంబర్ లో యూరోప్ షెడ్యూల్ బిగిన్ చేసే ప్రాసెస్ లో ఉన్న ‘సాహో’ టీమ్ ఈ షెడ్యూల్ కి సంబంధించి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ బిగిన్ చేసేశారు. ఈ షెడ్యూల్ లో యూరోప్ లోని పురాతన కట్టడాల మధ్య భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి శంకర్-ఎహసాన్-లాయ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా 2019 లో రిలీజవుతుంది.