అంజలి ఇకపై జస్ట్ చుట్టం చూపుకేనా..?

Thursday,May 23,2019 - 10:02 by Z_CLU

అంజలి సినిమా అంటే సమ్ థింగ్ స్పెషల్ ఉంటుందనే ఫీలింగ్ ఉంది ఆడియెన్స్ లో. కానీ అదేంటో సంవత్సరానికి కనీసం ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వట్లేదు. అలాగని ఈ తెలుగమ్మాయి ఖాళీగా ఉందా అంటే.. తమిళంలో సూపర్ బిజీ… మరి తెలుగులో ఎందుకు ఇంత గ్యాప్..?

న్యాచురల్ గా కనిపించే ఫేస్.. మాస్ ఆడియెన్స్ ని కూడా మెప్పించగలిగే గ్లామర్ అంజలి ఎసెట్ అయితే, తనని ఇంప్రెస్ చేయగలిగే కథలు రాకపోవడమే అంజలికి మైనస్ లా మారింది. పర్ఫామెన్స్ కి కొంచెం స్కోప్ ఉన్నా చాలు సినిమా చేసేస్తాను అని అంజలి స్టేట్ మెంట్స్ ఇస్తున్నా, అవి కేవలం కోలీవుడ్ ఫిలిమ్ మేకర్స్ కే రీచ్ అవుతున్నాయి… దాంతో న్యాచురల్ గానే అంజలి సినిమాల సంఖ్య టాలీవుడ్ లో తగ్గిపోతుంది.

తెలుగులో హీరోయిన్స్ పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న సినిమాలు రావట్లేదా..? అంటే లేదు అని కాదు.. ఆ సినిమాల్లో అవకాశమే అంజలికి రావట్లేదు.. ఈ రోల్ లో అంజలి బావుంటుందేమో అనే ఆలోచన వచ్చే లోపే ఆ ప్లేస్ లో మరో స్టార్ హీరోయిన్ ఫిక్సయిపోతుంది.

అందుకే అంజలి టాలీవుడ్ లో కన్నా కోలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది. మహా అయితే ఇక్కడ ఏదైనా సినిమా రిలీజైతే అది బైలింగ్వల్ అయి ఉంటుంది తప్ప, పర్టికులర్ గా ఇది అంజలి నటించిన తెలుగు సినిమా అని చెప్పుకునే స్థాయి సినిమా ఎప్పటికో కానీ  రావట్లేదు. అలా ‘అంజలి తెలుగు సినిమాకి జస్ట్ చుట్టం చూపుకే..’ అన్నట్టు మారిపోయింది పరిస్థితి.