ఆనంద‌ భైర‌విగా అల‌రించ‌నున్న అంజ‌లి

Monday,November 19,2018 - 11:41 by Z_CLU

అతి త‌క్కువ కాలంలోనే చ‌క్క‌ని న‌టిగా గుర్తింపు తెచ్చుకున్న అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌ధారిగా ఆనంద‌భైర‌వి చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలో ల‌క్ష్మీరాయ్ ప్ర‌త్యేక పాత్ర పోషించ‌నున్నారు. ఓ యంగ్ హీరో అంజలికి జోడి గా నటించనున్నారు. క‌ర్రి బాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రేవ‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకం పై ర‌మేశ్‌రెడ్డి ఇటికెల ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

స‌రికొత్త పాయింట్‌తో, భారీ బ‌డ్జెట్‌తో రూపుదిద్దుకొనే ఈ చిత్రం షూటింగ్ డిసెంబ‌ర్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమా గురించి నిర్మాత ర‌మేశ్‌రెడ్డి ఇటికేల మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ నాకు బాగా న‌చ్చింది. ప్రేక్షకులు కోరుకొనే అన్ని అంశాలూ అందులో ఉండ‌టంతో సినిమా తీయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. జ‌న‌వ‌రి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుందని తెలిపారు.

చిత్ర ద‌ర్శ‌కుడు క‌ర్రి బాలాజీ మాట్లాడుతూ స‌మాజంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకొంటుంది. హైద‌రాబాద్‌, వైజాగ్‌, కేర‌ళ‌లోని ప‌లు అంద‌మైన లొకేష‌న్ల‌లో షూటింగ్ చేస్తాం. అని చెప్పారు. అంజ‌లి ఈ సినిమాలో ఫస్ట్ టైం యాక్షన్ క్యారెక్టర్ చేయబోతోంది.