సెట్స్ పైకొచ్చిన మెగా మల్టీస్టారర్

Monday,November 19,2018 - 11:26 by Z_CLU

టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ప్రాజెక్టు ఆర్-ఆర్-ఆర్. ఎట్టకేలకు ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ప్రకటించాడు. తొలిరోజు సెట్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు జక్కన్న. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి ఫస్ట్ వర్కింగ్ స్టిల్ ఇదే.

ఈ మల్టీస్టారర్ కోసం భారీ సెట్స్ వేయబోతున్నారనే విషయం బ్యాక్ గ్రౌండ్ చూస్తేనే అర్థమౌతోంది. భారీ క్రేన్స్ ఉపయోగించి ఈ సెట్ వేస్తున్నారు. అయితే ఈ సెట్ ఎందుకు అనే విషయంపై స్పష్టత లేదు. ఫస్ట్ షెడ్యూల్ లో కేవలం ఎన్టీఆర్ మాత్రమే ఉంటాడంటూ మొన్నటివరకు రూమర్స్ వినిపించాయి. కట్ చేస్తే ఇప్పుడు సెట్స్ లో చరణ్ కూడా కనిపిస్తున్నాడు.

మొత్తానికైతే రాజమౌళి ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే.. సరిగ్గా రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈ దర్శకుడు మళ్లీ మెగాఫోన్ పట్టుకున్నాడు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు రామరావణ రాజ్యం అనే టైటిల్ పెట్టబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ సినిమా కోసం హీరోలిద్దరూ ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు.