మళ్లీ అతడికే ఛాన్స్

Monday,February 18,2019 - 04:09 by Z_CLU

అనిరుధ్ అంతే. ఒకసారి ఇతడితో వర్క్ చేస్తే మళ్లీ మళ్లీ అతడ్నే రిపీట్ చేయాలని అనిపిస్తుంది. అంతలా కట్టిపడేస్తాడు ఎవర్నయినా. ఇప్పుడీ లిస్ట్ లోకి నాని కూడా చేరిపోయాడు. అనిరుధ్ వర్క్ కు మెస్మరైజ్ అయిన నేచురల్ స్టార్, వరుసగా రెండోసారి అతడికే ఛాన్స్ ఇచ్చాడు

ప్రస్తుతం జెర్సీ సినిమా చేస్తున్నాడు నాని. ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో పాటలు నానికి బాగా నచ్చాయి. ఎంత నచ్చాయంటే, ఏమాత్రం గ్యాప్ లేకుండా వెంటనే అనిరుధ్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు.

ఈరోజు లాంఛ్ అయిన నాని కొత్త సినిమాకు కూడా సంగీతం అందించే ఛాన్స్ అనిరుధ్ కే దక్కింది. నిజానికి తన కెరీర్ లో నానికి బాగా నచ్చిన మ్యూజిక్ డైరక్టర్ గోపీసుందర్. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా నేచురల్ స్టార్ కు అనిరుద్ వర్క్ నచ్చినట్టుంది. అందుకే వెంటనే మరో చాన్స్ ఇచ్చాడు.