ఆలీ 40 ఏళ్ల సినిమా ప్రయాణం

Monday,February 18,2019 - 05:19 by Z_CLU

1979లో రిలీజైన ‘నిండు నూరేళ్ళు’ సినిమాతో ఓ బాల కమెడియన్ పుట్టాడు. ఆ టైటిల్ లాగే ‘నిండు నూరేళ్ళు’ నవ్విస్తూనే ఉండాలని ఫిక్సయి ఆ కుర్రాడిని ఇంట్రడ్యూస్ చేశారేమో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. అందుకే ఆరోజు మొదలైన ఆ కుర్రాడి నవ్వుల ప్రయాణం ఏమాత్రం విరామం లేకుండా సాగుతూనే ఉంది. ఆ కుర్రాడెవరో కాదు అలీ. ఆయన తన సినిమా ప్రయాణం బిగిన్ చేసి 40 ఏళ్ళు కావొస్తుంది.

 నా కొడుకు నలుగురినీ నవ్విస్తూ అందరి చేత చప్పట్లు కొట్టించుకోవాలని కల కనేవారట అలీ నాన్నగారు. చప్పట్లు కొట్టించుకునే స్థాయినుండి సినిమాలో అలీ కామెడీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూసే స్థాయికి ఎదిగిన నటుడు అలీ. ఈ నలభై ఏళ్ల ప్రయాణంలో ఆయన సిల్వర్ స్క్రీన్ పై క్రియేట్ చేసిన కొత్త పదాలెన్నో, వేసిన వేషాలెన్నో…

అలీ జస్ట్ కామెడీ మాత్రమే  చేయగలడు  అంటే వరసగా కొన్ని సినిమాలు అడ్డుపడతాయి. ఎందుకంటే అలీ కరియర్ లో కంటతడి పెట్టించిన క్యారెక్టర్స్ ఎన్నో. అలీ కేవలం సినిమాలో కమెడియన్ గానే మిగిలిపోయాడా..? అంటే, హీరోగా వరస సినిమాలు చేసి బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకున్న మరెన్నో సినిమాలు గుర్తుకొచ్చేస్తాయి. అటు హీరోగా కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలీ ఈ 40 ఏళ్ళలో చేయని క్యారెక్టర్ లేదు.

ఆయన ఇన్నాళ్ళ సక్సెస్ ఫుల్ జర్నీకి జస్ట్ ఆడియెన్స్ లో ఉన్నఅభిమానం ఒక్కటే రీజనా అంటే  అది 100% కరెక్ట్. దానికి తోడు ఇండస్ట్రీలో కొంతమంది ఫిల్మ్ మేకర్స్ సక్సెస్ కి కూడా అలీ కామెడీ టైమింగ్ పెద్ద ఎసెట్. అందుకే ఆయన కోసం అదే పనిగా క్యారెక్టర్స్ రాసుకుని మరీ, ఆయనతో పని చేస్తారు దర్శకులు.

సినిమాలలో ప్రతిభ కనిపించినందుకు గాను రెండు నంది అవార్డులను అందుకున్న అలీ, సేవా కార్యక్రమాల్లోను అంతే చురుగ్గా పాల్గొని, గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇప్పటికీ చేసే ప్రతి సినిమాని మొదటి సినిమా తరహాలో అంతే దీక్షగా చేసే ఆలీ, మరెన్నో హైట్స్ కి రీచ్ అవ్వాలని, ఇంకెన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది జీ సినిమాలు.