పేరుకే సీక్వెల్స్... అసలు కథ వేరు

Monday,February 18,2019 - 03:23 by Z_CLU

కొన్ని సినిమాలు కాంబినేషన్స్ తో బజ్ క్రియేట్ చేస్తే, కొన్ని సినిమాలకి జస్ట్ స్టార్ డమ్ సరిపోతుంది. అయితే ఒక టీజర్ రిలీజ్ చేయకుండా, ట్రైలర్ కూడా బయటికి రాకుండా అసలు సినిమా కూడా సెట్స్ పైకి కూడా రాకముందే ఆ సినిమాపై బజ్ క్రియేట్ అయిందంటే అనుమానమే లేదు. అది డెఫ్ఫినెట్ గా గతంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాకి సీక్వెలే. అయితే ఈ సీక్వెల్స్ నిజంగా సీక్వెల్సేనా…? లేకపోతే జస్ట్ టైటిల్స్ పక్కన నంబర్ చేరుతుందా..?

మన్మధుడు 2 : రేపో మాపో సెట్స్ పైకి రానుంది నాగార్జున ‘మన్మధుడు 2’. ఎప్పుడో 2002 లో రిలీజైన ఈ సినిమా తెలుగు సినిమా ఆడియెన్స్ మోస్ట్ ఫేవరేట్ లిస్టు లో తప్పకుండా ఉంటుంది. అయితే ఈ ఏడాది మార్చి నుండి సెట్స్ పైకి వస్తున్న ‘మన్మధుడు 2’, ‘మన్మధుడు’ సినిమాకి కొనసాగింపా అంటే… అస్సలు కాదు. జస్ట్ టైటిల్ ని వాడుకుంటున్నారు అంతే. అది రొమాంటిక్ ఎంటర్ టైనర్ కాబట్టి, ఈ సినిమాలోను అదే ఫ్లేవర్ ని ప్రెజెంట్ చేసే చాన్సెస్ ఉన్నాయి.

బంగార్రాజు : సినిమా సెట్స్ పైకి రాకపోయినా ‘బంగార్రాజు’ అందరికీ పరిచయమే. గతంలో రిలీజైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా గురించి ఏ చిన్న టాపిక్ వచ్చినా డామినేట్ చేసేది ‘బంగార్రాజు’ క్యారెక్టరే. అందుకే ఈ టైటిల్ తోనే మరోసారి సెట్స్ పైకి వస్తున్నారు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున. ఇదీ ఆల్మోస్ట్ ‘సోగ్గాడే చిన్న నాయనా’ కి సీక్వెలే. కాకపోతే కథ మొత్తం వేరుగా ఉండబోతుంది.

ప్రేమకథా చిత్రమ్ 2 : టాలీవుడ్ లో హారర్ కామెడీ స్టార్ట్ అయిందంటేనే అది ‘ప్రేమకథాచిత్రమ్’ సినిమాతో. మినిమం బడ్జెట్ తోనే ఆల్మోస్ట్ అందరినీ నవ్వించి గుర్తుండిపోయిందీ సినిమా. అయితే దీనికి కూడా సీక్వెల్ రెడీ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, కథ దగ్గరి నుండి ఆర్టిస్టుల వరకు అంత చేంజ్. జస్ట్ టైటిల్ పక్కన 2 చేరింది అంతే.

ఇదే వరసలో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న గీతాంజలి 2, ఆల్రెడీ రిలీజైన రాజుగారి గది 2, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు కూడా అంతే. పేరుకే సీక్వెల్స్. ఇందులో  అంతకు ముందు సినిమా కథతో ఏ మాత్రం సంబంధం ఉండదు.