ఇండియన్-2లో మెయిన్ విలన్ ఇతడే?

Wednesday,October 02,2019 - 11:02 by Z_CLU

ఇప్పటికే ఓ బాలీవుడ్ హీరోను విలన్ గా మార్చేశాడు శంకర్. ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోపై కన్నేశాడు. అవును.. అక్షయ్ కుమార్ ను 2.Oలో విలన్ గా చూపించిన ఈ దర్శకుడు, ఇప్పుడు అనీల్ కపూర్ ను ఇండియన్-2తో విలన్ గా మార్చే పనిలో పడ్డాడు. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. త్వరలోనే ఆఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుంది.

కమల్ హాసన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది ఇండియన్-2. ఈ సినిమాలో అజయ్ దేవగన్ ను విలన్ గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ అజయ్ దేవగన్, ఆర్-ఆర్-ఆర్ లో విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడు. కాల్షీట్లు కూడా ఇచ్చేశాడు. దీంతో అనీల్ కపూర్ ను సంప్రదించింది యూనిట్.

ఇండియన్-2లో జర్నలిస్ట్ గా కనిపించబోతున్నాడు సిద్దార్థ్. ఇతడి గర్ల్ ఫ్రెండ్ గా రకుల్ నటిస్తోంది. మెయిన్ హీరోయిన్ గా కాజల్ కనిపించనుంది. నవంబర్ నుంచి కాజల్ సెట్స్ పైకి వస్తుంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.